(Regd.No.75/BK-IV/05)
   +91 99661 12933
   +91 863-2235890

KET Scholarship - 2023

10వ తరగతి నందు, జూనియర్ ఇంటర్ నందు మరియు EAMCET, NEET, ICET, PGCET లలో 2023లో ప్రతిభ కనబరిచిన పేద విద్యార్థులు అర్హులు.
  • స్కాలర్ షిప్ కు అప్లై చేసుకొనే విద్యార్థుల అర్హతలు

    1. ఎస్ ఎస్ సి లో ఉత్తీర్ణులై, జూనియర్ ఇంటర్ లో చేరినవారికి కనీస అర్హత - ఎస్ ఎస్ సి లో గ్రేడ్ ఏ -2 (8.3 జిపిఏ) మరియు ఆపైన సాధించిన వారు అర్హులు.
    2. సీనియర్ ఇంటర్ లో చేరిన వారికి , జూనియర్ ఇంటర్ లో ఎంపిసి లో ఏ1, బైపీసీలో ఏ2, ఎంఇసి లో బి1, సిఇసి మరియు హెచ్ఇసిలో బి2 మరియు ఆపైన కనీస గ్రేడులు సాధించిన వారు అర్హులు.
    3. ఎంసెట్, నీట్ లలో (మెడికల్, ఇంజనీరింగ్, అగ్రికల్చర్, ఫార్మసీ) ఫ్రీ సీటు సంపాదించిన వారు అర్హులు.
    4. ఐసెట్ మరియు ఇతర పీజి కోర్సులలో అనగా ఐసెట్, ఓయుసెట్, ఎస్ వి సెట్, ఏఎన్ యు సెట్ లలో ఫ్రీ సీటు సంపాదించిన వారు అర్హులు.
    5. పిహెచ్ డి చేసే విద్యార్థులు స్కాలర్ షిప్ లేనివారు మాత్రమే అప్లై చేసుకొనుటకు అర్హులు.
  • గమనిక:

    1. పైన ఉదహరించిన కనీస అర్హతలు, కౌండిన్య ఎడ్యుకేషనల్ ట్రస్ట్ కు అప్లికేషన్ పెట్టుకొనుట వరకే. స్కాలర్ షిప్ మంజూరు చేయునప్పుడు మాత్రం వచ్చిన అప్లికేషన్ లలో పేదరికం మరియు అత్యధిక గ్రేడులు/ మార్కులు /ర్యాంకులు చూచి, ట్రస్ట్ వద్దనున్న వనరులను దృష్టిలో ఉంచుకొని స్కాలర్ షిప్ కమిటీ, విద్యార్థులను ఎంపిక చేస్తుంది.
    2. ఇంజనీరింగ్, మెడిసిన్, పీజిలలో ఇంతకు పూర్వం ట్రస్ట్ నుండి స్కాలర్ షిప్ పొందినవారు కూడా దరఖాస్తు చేసుకోవచ్చు.
  • కుల పెద్ద/ ఇతర ఉద్యోగి సిఫార్సు లెటర్:

    పైన తెలిపిన విద్యార్థిని, విద్యార్థి .......... కులానికి చెందిన పేదవారు. ట్రస్ట్ నుండి స్కాలర్ షిప్ పొందుటకు అర్హులు. - కుల పెద్ద/ ఇతర ఉద్యోగి సంతకం.
  • దరఖాస్తుతో జతపరచవలసినవి

    1. జూనియర్/ సీనియర్ ఇంటర్ లో చేరిన వారు.
      1. జూనియర్ ఇంటర్ లో చేరిన వారు - ఎస్. ఎస్. సి. మార్క్స్ లిస్ట్ జిరాక్స్ కాపీ.
        సీనియర్ ఇంటర్ లో చేరిన వారు - జూనియర్ ఇంటర్ మార్క్స్ లిస్ట్ జిరాక్స్ కాపీ.
      2. ప్రస్తుతం చదువుతున్న కాలేజీ నుండి, ఆ కాలేజీ ప్రిన్సిపాల్/ డైరెక్టర్ చేత జారీ చేయబడిన స్టడీ సర్టిఫికెట్.

    2. ఎంసెట్, నీట్, ఐ.సెట్ మరియు పి.జి.సెట్ స్థాయిలలో చేరిన వారు.
      1. ఎంసెట్, నీట్: ఇంటర్ మార్క్స్ లిస్ట్ జిరాక్స్ కాపీ, ర్యాంక్ కార్డు జిరాక్స్ కాపీ మరియు చేరిన ఇంజనీరింగ్ కాలేజీ/ మెడికల్ కాలేజీ నుండి స్టడీ సర్టిఫికెట్.
      2. ఐసెట్ మరియు ఇతర పి.జి. సెట్: డిగ్రీ మార్క్స్ లిస్ట్ జిరాక్స్ కాపీ, ర్యాంక్ కార్డు జిరాక్స్ కాపీ మరియు అడ్మిషన్ పొందిన కాలేజీ నుండి స్టడీ సర్టిఫికెట్.

    అన్ని రకాల విద్యాస్థాయి వారు కామన్ గా జతపరచవలసినవి.
    1. తహసీల్దారుచే జారీ చేయబడిన కులధ్రువీకరణ పత్రం మరియు సంవత్సరాదాయ పత్రం.
    2. కుల పెద్ద సిఫార్స్ లెటర్.
    3. పాస్ పోర్ట్ సైజు ఫోటో ఇ-మెయిల్ చెయ్యవలెను.
  • ఇ-మెయిల్ అడ్రస్:

    అప్లికేషన్ మరియు జతపరచవలసిన సర్టిఫికేట్స్ ని పంపవలసిన ఇ-మెయిల్ అడ్రస్: kaundinyatrust@gmail.com
  • ముఖ్యమైన తేదీలు

    దరఖాస్తులు స్వీకరించుటకు:
    ప్రారంభ తేది: 15-09-2023
    ముగింపు తేది: 02-12-2023 (ఈ తేది తరువాత వచ్చిన దరఖాస్తులు స్వీకరించబడవు.)
  • స్కాలర్ షిప్ ల బహూకరణ కార్యక్రమము

    1. స్కాలర్ షిప్ (Scholarship)పొందుటకు, అర్హత పొందిన విద్యార్థి/విద్యార్థిని, తప్పని సరిగా స్కాలర్ షిప్ ల బహూకరణ కార్యక్రమమునకు, హాజరయినప్పుడు మాత్రమే, ప్రోత్సాహక స్కాలర్ షిప్ పొంద గలరు.
    2. Date: స్కాలర్ షిప్ ల బహూకరణ కార్యక్రమము, 07-జనవరి-2024 (ఆది వారం) ఉదయం 8 గంటల నుండి సాయంత్రం 5 గంటల వరకు జరుగును. కాబట్టి తిరుగు ప్రయాణము, ఆ రోజు సాయంత్రం 4 గంటల తరువాత మాత్రమే, ఏర్పాటు (plan) చేసుకొనవలెను.
    3. Venue: కౌండిన్య IAS అకాడమీ, గౌడజన సేవా సమితి, కౌండిన్య పురం,
      వెనిగండ్ల (Village), పెదకాకాని (Mandal), గుంటూరు (District), ఆంధ్ర ప్రదేశ్.
    4. ఉదయం 10 గంటలలోపు వచ్చి, రిజిస్ట్రేషన్ (Registration)పూర్తి చేసుకొని, Breakfast ముగించుకొని, Personality Development Programmeకు హాజరు కావలయును.
    5. విద్యార్థి/విద్యార్థినితో బాటుగా, తల్లిదండ్రులు గాని, సంరక్షకులు, సోదరసోదరీ మణులు వస్తున్నట్లయితే, ముందుగా (31-డిసెంబర్-2023 సాయంత్రం 5 గంటల లోపు) 9959691669 కి ఫోను చేసి తెలియజేసిన ఎడల, వారికి Breakfast, Lunch ఏర్పాట్లు చేయుటకు సౌకర్యముగా ఉంటుంది.
    6. మీకు తెలియజేసిన విధముగా, 1. గత సంవత్సరపు Marks List, 2. ప్రస్తుత సంవత్సరపు (2023-2024) Study Certificate బాటుగా, 3. Passport Size Photo తెచ్చుకొనవలయును.
  • సంశయాల నివృత్తి కొరకు:

    99596 91669 ను సంప్రదించగలరు.